ఏపీ మీదుగా తెలంగాణకు వస్తున్న గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిట్యాల వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీలో 100 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా దానిని సీజ్ చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఏవోబీ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తోంది ముఠా. ఎస్పీ రంగనాద్ నేతృత్వంలో హైవేపై గంజాయి ఆపరేషన్ కొనసాగుతోంది. కూకట్‌పల్లిలో గంజాయి ఆయిల్‌ని పట్టుకున్నారు పోలీసులు. ఆశిష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు.
కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు వద్ద గంజాయి నూనె విక్రయించేందుకు యత్నించారు ఉమామహేష్, బాలకృష్ణలు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు ఎక్సైజ్ పోలీసులు. నిజాంపేటలో గంజాయి నూనె సరఫరా చేస్తున్న దుర్గాప్రసాద్ ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముగ్గురి నుంచి 200 గ్రాముల ఆశిష్ ఆయిల్, ఓ ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.