NTV Telugu Site icon

Hyderabad: చార్మినార్ వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్.. నడిరోడ్డు పై కట్టెలతో దాడి..

Ganja Batch Commotion At Hyderabad

Ganja Batch Commotion At Hyderabad

Hyderabad: హైదరాబాద్ చార్మినార్ వద్ద నడిరోడ్డుపై గంజాయి బ్యాచ్ హంగామా సృష్టించారు. ఉదయం నడిరోడ్డుపై కర్రలతో ఒకరి పై ఒకరు దాడి చేసుకుంటూ హల్ చల్‌ చేశారు. ఒకరి నొకరు పట్టుకుని తూగుతూ.. కర్రెలతో దాడి చేసుకున్నారు. దీంతో వాహనదారులు గంజాయి బ్యాచ్‌ ను ఆపడానికి ప్రయత్నించినా వారిని కూడా నెట్టివేశారు. ఈ ఘటనతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు కట్టెలతో కొట్టుకోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. నడిరోడ్డు పైనే దాడికి దిగడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటపాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నడిరోడ్డుపై గంజాయి సేవించి ఇలా నానా రచ్చ చేయడం ఇది మొదటి సారి కాదని, ఇలా వీకెండ్‌ లో కూడా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడని వాపోయారు. శని, ఆదివారాలే అనుకుంటే ఇప్పుడు సోమవారం ఉదయం నుంచే గంజా బ్యాచ్‌ ఆగడాలకు హద్దులేకుండా పోయాయని మండిపడుతున్నారు. నడిరోడ్డు పై ఉన్నామనే భయం కూడా లేకుండా.. ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతున్న పట్టించుకోకుండా.. ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Coconut Oil: కొబ్బరి నూనెలో ఈ మూడు కలిపిరాయండి.. జుట్టు పెరుగుదలను అస్సలు ఆపలేరు..

Show comments