Hyderabad: చార్మినార్ వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్.. నడిరోడ్డు పై కట్టెలతో దాడి..
- చార్మినార్ లో నడిరోడ్డు పై గంజాయి బ్యాచ్ హంగామా..
- కర్రలతో ఒకరి పై ఒకరు దాడి -భయాందోళనకు గురైన వాహనదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ చార్మినార్ వద్ద నడిరోడ్డుపై గంజాయి బ్యాచ్ హంగామా సృష్టించారు. ఉదయం నడిరోడ్డుపై కర్రలతో ఒకరి పై ఒకరు దాడి చేసుకుంటూ హల్ చల్ చేశారు. ఒకరి నొకరు పట్టుకుని తూగుతూ.. కర్రెలతో దాడి చేసుకున్నారు. దీంతో వాహనదారులు గంజాయి బ్యాచ్ ను ఆపడానికి ప్రయత్నించినా వారిని కూడా నెట్టివేశారు. ఈ ఘటనతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు కట్టెలతో కొట్టుకోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. నడిరోడ్డు పైనే దాడికి దిగడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటపాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నడిరోడ్డుపై గంజాయి సేవించి ఇలా నానా రచ్చ చేయడం ఇది మొదటి సారి కాదని, ఇలా వీకెండ్ లో కూడా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడని వాపోయారు. శని, ఆదివారాలే అనుకుంటే ఇప్పుడు సోమవారం ఉదయం నుంచే గంజా బ్యాచ్ ఆగడాలకు హద్దులేకుండా పోయాయని మండిపడుతున్నారు. నడిరోడ్డు పై ఉన్నామనే భయం కూడా లేకుండా.. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న పట్టించుకోకుండా.. ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Coconut Oil: కొబ్బరి నూనెలో ఈ మూడు కలిపిరాయండి.. జుట్టు పెరుగుదలను అస్సలు ఆపలేరు..
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!