Gang War: ఢిల్లీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. భాయ్ అని పిలువనందుకు ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేశాడు ఏ వ్యక్తి. వివరాల్లోకి వెళితే రఘు, జాకీర్, భూరా అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం డబ్లూ అనే వ్యక్తిని కలవడానికి ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి వెళ్లారు. ముగ్గురూ ఆ ప్రాంతంలో డబ్లు కోసం వెళ్లారు.
ముగ్గురు కలిసి డబ్లు కోసం వెతుకుతుండగా.. ఒక వ్యక్తి డబ్లు గురించి ఆరా తీశారు. ఆ సమయంలో డబ్లూ అనవద్దు, డబ్లు భాయ్ అని అనాలని స్థానికంగా ఉన్న వ్యక్తి సూచించాడు. అయితే ఈ విషయంపై వాగ్వాదం చెలరేగింది. గొడవ పెద్దది కావడంతో డబ్లు తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రఘు, డబ్లుపై కాల్పులు జరిపాడు. ప్రతీకారంగా డబ్లు సహచరులు కూడా రఘుపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన రఘు అక్కడే మరణించాడు.
Read Also: Bathukamma festival : బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనక దాగున్న రహస్యం ఇదే..
జాకీర్, భూరాలు సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారు. డబ్లు సహచరులు వీరిని వెంబడించి పట్టుకున్నారు. భూరాను వారు కత్తితో పొడిచి చంపారు. అయితే జాకీర్ మరోసారి వారి నుంచి తప్పుంచుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం డబ్లు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు డబ్లుకు సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.