Site icon NTV Telugu

Gang Rape: ఉత్తరప్రదేశ్ దారుణం.. స్కూల్ టీచర్ పై గ్యాంగ్ రేప్.. హత్య

Untitled Design (2)

Untitled Design (2)

రోజు రోజుకు దేశంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, క్రూరమైన హత్యలు చేస్తున్నారు దుండగులు. ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను క్రూరంగా హతమార్చారు దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు భూపేంద్రకు కాల్ చేశాడు. ఆమె మాటలు బయటకు రాకుండా గొంతులో గుడ్డలు నొక్కిన ఇద్దరు.. అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని కాలువలో పడేశారు.

కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఆమె మృతదేహం కాలువలో లభ్యమైంది. నిందితులు రాజు వర్మ, భూపేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. అత్యాచారం, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. రేప్ జరిగిందని, గొంతు బిగించి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో కన్ఫర్మ్ అయిందని చెప్పారు. Give English URL, SEO Meta Title, SEO Meta Description, SEO Meta Keywords in English

Exit mobile version