ఖరీదైన పట్టుచీరలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.17.5 లక్షల విలువైన 38 పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rain Alert to Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!
మహిళలు ముఠాగా ఏర్పడి పలు దుకాణాల్లో పట్టుచీరలను దొంగిలిస్తున్నారు. అప్పటికే పలు షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. మొత్తానికి పాపం పండి అడ్డంగా బుక్కయ్యారు. జేపీ నగర్‌లోని ఓ దుకాణంలోకి ప్రవేశించిన ముఠా.. కొందరు చీరలు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ.. ఇంకొందరు సిబ్బంది దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి 38 పట్టుచీరలను ముఠా నొక్కేసింది. అయితే సిబ్బందిలో కొందరికి వీళ్ల కదలికలపై అనుమానం వచ్చి బయటకు వెళ్లే మార్గంలో తనిఖీ చేయగా లూటీ చేసిన చీరలు బయటపడ్డాయి. దాదాపు రూ.17.5లక్షల ఖరీదైన పట్టుచీరలను దొంగిలించారు. దీంతో దుకాణం యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద తెలిపారు. విచారణలో ఇప్పటికే పలు షాపుల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్లుగా తేలిందని పోలీసులు చెప్పారు. దొంగలించిన పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Rekha Nair: తమిళ లైంగిక వేధింపుల లిస్టు తీస్తే 500 మంది ఇరుక్కుంటారు.. నటి సంచలనం