NTV Telugu Site icon

Asaram Bapu: మరో లైంగిక దాడి కేసులో దోషిగా ఆశారాం బాపు.. రేపు శిక్ష ఖరారు..

Asaram Bapu

Asaram Bapu

Asaram Bapu: ఇప్పటికే అనేక లైంగిక ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్న బాబా ఆశారాం బాపు, మరో కేసులోనూ దోషిగా తేలారు. మంగళవారం శిక్షలు ఖరారు చెయ్యనుంది గుజరాత్ గాంధీనగర్ సెషన్స్ కోర్టు. మోటేరా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది సూరత్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు. పదేళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లయింట్ పై తాజాగా కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో నిందితులైన ఆశారాం కుమారుడు నారాయణ్‌ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. అహ్మదాబాద్‌ జిల్లా మోటేరాలోని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన మహిళా భక్తురాలు ఆరోపించింది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అయితే, పదేళ్ల కిందట ఆమె చేసిన ఫిర్యాదుపై గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.. ఆశారాం బాపును దోషిగా నిర్ధారించింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం కుమారుడు నారాయణ్‌ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులు ధ్రువ్‌బెన్, నిర్మల, జస్సీ, మీరాను నిర్దోషులుగా పేర్కొంది కోర్టు.. కాగా, ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జైలులో ఉన్నాడు. 2013లో జోధ్‌పూర్‌ ఆశ్రమంలో ఆయన తనపై లైంగికదాడికి పాల్పడినట్లు 16 ఏళ్ల బాలిక పోలీసులకు అప్పట్లో ఫిర్మాదు చేయడంతో.. ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెప్టెంబర్‌లో జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన జోధ్‌పూర్‌ ట్రయల్ కోర్టు 2018లో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. దీంతో నాటి నుంచి ఆయన జోధ్‌పూర్‌ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.. మరి తాజా కేసులో ఆయనకు కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో రేపు తేలిపోనుంది.

Show comments