మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. అంతేకాకుండా.. అత్యాచారం వీడియో తీసినట్లు బాధితురాలు చెబుతోంది. నిందితుడు తనకు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడని తెలిపింది. ఈ క్రమంలో తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. అతని వేధింపుల వల్ల ఏడాదిన్నరలో మూడు ఇళ్లను మార్చింది. అయితే నిందితుడిపై ఆగడాలు తట్టుకోలేక హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టింది. అత్యాచారం, దాడి సహా పలు సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతి తెలిపిన వివరాల ప్రకారం.. తాను బామోరి నుండి వచ్చి ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపింది. తన నాన్న మానసిక అనారోగ్యంతో ఉన్నారని.. అతను మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని పేర్కొంది. తమ్ముడు చదువుకుంటున్నాడు.. ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వాపోయింది. ఈ క్రమంలో.. రెండున్నరేళ్ల క్రితం గుణ వచ్చినట్లు పోలీసులకు చెప్పింది. తాను చేసే ఉద్యోగం డబ్బులతో ఇంటికి పంపించేదాన్ని అని తెలిపింది. అయితే.. 2022 సంవత్సరంలో తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువకుడితో స్నేహం చేశానని.. తన పేరు భయ్యూ అని చెప్పింది.
Read Also: Anushka Shetty: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి.. సూడోబుల్బార్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా?
క్రమంగా యువతి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. అంతేకాకుండా.. తరచుగా కలుసుకునేవాళ్లమని యువతి చెప్పింది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలా ఉన్నాయని.. అయితే ఒకరోజు తాను ఓ గదిలో అద్దెకు ఉంటున్నానని తెలిసి.. అక్కడికి వచ్చాడని తెలిపింది. ఈ క్రమంలో.. తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని, అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడని చెప్పింది. ఇక అప్పటి నుంచి తనపై చిత్రహింసలు మొదలయ్యాయని.. తన ఫోటో-వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది.
అంతేకాకుండా.. నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని చెప్పింది. అందుకోసం.. మత మార్పిడి ఒత్తిడి చేయడం కూడా ప్రారంభించాడని తెలిపింది. నిందితుడు ఫోన్ చేసి చిత్రహింసలు పెట్టేవాడని, ఈ క్రమంలో రెండుసార్లు రూమ్ మారినట్లు యువతి చెప్పింది. గత ఏడాదిన్నరగా నిందితుడు అర్షద్ తనను చాలా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనూప్ భార్గవ తెలిపారు.