Free Fire Game: ఫ్రీ ఫైర్లో రూ.2,800 నష్టపోయిన 13 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులు తిడతారని చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Fire Game: ఫ్రీ ఫైర్ కారణంగా మరో ప్రాణం బాలి అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల ఆక్లాన్ జైన్ అనే ఏడవ తరగతి విద్యార్థి, ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతూ రూ.2,800 పోగొట్టుకున్న తర్వాత, తల్లిదండ్రులు కొడతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఇండోర్ నగరంలోని అనురాగ్ నగర్ లో చోటుచేసుకుంది. ఆక్లాన్ జైన్ అనే బాలుడు, ఇంట్లో ఉన్న సమయంలో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. తన తల్లి డెబిట్ కార్డ్‌ను గేమ్ IDకి లింక్ చేసి రూ.2,800 ఖర్చు చేశాడు. ఆ విషయాన్ని తన తల్లికి తెలిపిన తరువాత.. వారేమంటారో అనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Akash Deep Fifty: ఆకాశ్ దీప్ సూపరో సూపర్.. హాఫ్ సెంచరీ వీడియో వైరల్!
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ఆక్లాన్ ఉరివేసుకుని ఉన్న దృశ్యాన్ని అతని తాత గమనించి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అక్కడి పరిస్థితిని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి, అధికారికంగా కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి MIG పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సీ.బీ. సింగ్ ప్రకారం.. ఆక్లాన్ వద్ద సిమ్ కార్డ్ లేని మొబైల్ ఉండేది. కానీ అది Wi-Fi ద్వారా కనెక్ట్ అయి ఉండేది. ఆ ఫోన్ ద్వారా తన తల్లి అపూర్వ జైన్ డెబిట్ కార్డ్‌ను లింక్ చేసి గేమ్‌లో రూ.2,800 ఖర్చు చేశాడని.. ఆ విషయాన్ని తల్లికి చెప్పిన తర్వాత బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
Konda Surekha vs KTR : మంత్రి కొండా సురేఖకు షాక్.. క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం
ఆక్లాన్ ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అతనికి ఓ తమ్ముడు ఉన్నాడు. తండ్రి అంకేష్ జైన్. అతను ఆటో పార్ట్స్ దుకాణాలను నడుపుతున్న వ్యాపారి. కేసును పరిశీలిస్తున్న పోలీసులు, ఆక్లాన్ మృతదేహాన్ని MY హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనతో పిల్లల్లో డిజిటల్ అలవాట్లపై పెద్దల మార్గనిర్దేశం ఎంత అవసరమో మరోసారి అర్థమవుతుంది. పిల్లలు మొబైల్, గేమింగ్‌పై అదుపు కోల్పోకుండా డిజిటల్ సంస్కారాన్ని నేర్పే బాధ్యత తల్లిదండ్రులదని వైద్య నిపుణులు, పిల్లల మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!