NTV Telugu Site icon

Fraud in Instagram: ఇన్‌స్టాలో రేటింగ్ పేరుతో భారీ మోసం.. మహిళా టెక్కీ నుంచి కోటిన్నర స్వాహా

Cyber Crime

Cyber Crime

ప్రస్తుతం భారత్ లో సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ ఆధారంగా కొత్త తరహ మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. పైబర్ నేరగాళ్ల గురించి పదేపదే పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా కూడా.. దేశ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో కొత్త తరహ మోసాలకు ప్రజలు గురౌతునే ఉన్నారు.

Also Read : Central Govt on Twitter : ట్విట్టర్ మాజీ సీఈఓ ఆరోపణలు అబద్ధం : కేంద్ర మంత్రి

తాజగా.. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే.. హైదరాబాద్ లో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు వసూలు స్వాహా చేశారు. తాను మోసపోయినట్టుగా భావించిన టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో టెక్కీకి పరిచయమైన నిందితులు తాము సూచించిన ఇన్ స్టా పేజీలకు రివ్యూ రేటింగ్ లు ఇవ్వాలని తెలిపింది.. అలా చేయడం వల్ల కమీషన్ ను కూడా చెల్లిస్తామని నిందితులు తెలిపారు.

Also Read : MRF First Indian Stock: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంఆర్ఎఫ్ అరుదైన రికార్డు

దీంతో మహిళ టెక్కీ ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రివ్యూ రేటింగ్ లు ఇచ్చింది. అయితే ఆ తర్వాత పెట్టుబడి స్కీం పేరుతో నిందితులు సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి డబ్బులు కాజేశారు. టెక్కీ దగ్గర నుంచి రూ. 1.50 కోట్లను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. అయినా కూడా మహిళా టెక్కీకి డబ్బులు రాలేదు. దీంతో తాను మోసోపోయినట్టుగా గ్రహించిన సదరు మహిళా టెక్కీ పోలీసులకు ఆశ్రయించింది. దీంతో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.