NTV Telugu Site icon

Murder for property: రూ.300 కోట్ల ఆస్తి కోసం మామని చంపేందుకు కోడలు ఎలా ప్లాన్ చేసిందంటే..

Nagpur Crime

Nagpur Crime

Murder for property: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆస్తి కోసం ఓ కోడలు పక్కా ప్లాన్‌లో మామగారిని హతమార్చింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం పన్నిన దారుణమై కుట్ర వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అర్చన మనీష్ పుట్టేవార్ గత వారం 82 ఏళ్ల తన మామా పురుషోత్తం పుట్టేవార్‌ని ప్లాన్ చేసి హతమార్చింది. 15 రోజుల క్రితం పురుషోత్తం కారు ఢీకొట్టడంతో మరణించారు. ఈ కేసును లోతుగా పరిశీలించిన పోలీసులకు నిజాలు వెలికి తీశారు. నిందితురాలైన అర్చనాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1 కోటి సుపారీగా ఇచ్చి ఆమె హత్య కోసం వ్యక్తుల్ని నియమించుకుంది.

Read Also: Andhra pradesh: ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్..(వీడియో)

అర్చన తన మామను చంపేందుకు నిందితులకు కారు కొనేందుకు డబ్బులు కూడా ఇచ్చింది. కారు ఢీకొట్టడాన్ని ప్రమాదంగా చూపించి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పురుషోత్తంకి సంబంధించిన రూ. 300 కోట్ల విలువైన ఆస్తులపై తన పట్టును సాధించేందుకు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. 53 ఏళ్ల మహిళ తన భర్త డ్రైవర్ అయిన బాగ్డేతో పాటు ఇద్దరు నిందితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌‌లతో కలిసి హత్యకు పథకం వేసిందిన పోలీసులు తెలిపారు. పోలీసులు హత్యతో పాటు మోటార్ వాహనాల చట్టంలోని ఇతర సెక్షన్ల కింది అభియోగాలు మోపారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఘటన జరిగిన రోజున సర్జరీ అయి కోలుకుంటున్న తన భార్య శకుంతలను కలిసేందుకు పురుషోత్తం పుట్టేవారు ఆస్పత్రికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తిరిగి వస్తున్న క్రమంలో కారు అతడి పైనుంచి దూకుకెళ్లింది.పురుషోత్తం కుమారుడు, అర్చన భర్త మనీష్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ హత్య విచారణ సమయంలోనే అర్చనా పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను కనుగొన్నారు. అయితే, ఆమెకు ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విచారణలో తేలింది. నిబంధనలను ఉల్లంఘించిన అక్రమ లేఅవుట్లను క్లియర్ చేశారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.