Marital Torture: భార్యలను భర్తలు టార్చర్ చేసిన ఘటనలు ఎన్నో చూశాం. ఇటీవలి కాలంలో సీన్ రివర్స్ అవుతోంది. భార్యలే భర్తలను టార్చర్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తలను వేధించడం మాత్రమే కాదు..కొంత మంది తెగించి కడతేర్చుతున్నారు.. మరికొంత మంది భర్తలే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో జరిగింది. నటుడు, జానపద గాయకుడిగా రాణిస్తున్న గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
అతని పేరు గడ్డం రాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌గాని పేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి.. మొన్నటికి మొన్న భార్య తనను వేధింస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది.
Alcohol Addiction: పైసా సంపాదన ఉండదు.. రాత్రి లేదు పగలు లేదు.. నిత్యం చుక్క పడాల్సిందే
నిజానికి గడ్డం రాజు.. తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆమె వరుసకు కోడలు అవుతుంది. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి రోజూ సౌందర్య.. రాజు తల్లిదండ్రులను తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు.. ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు.
బతుకమ్మ పండగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి మనస్థాపానికి లోనైన రాజు.. అమ్మా, బాపు… బతకలేకపోతున్నా.. నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చాలా టార్చర్ గా అనిపిస్తోంది. నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది. నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Mahesh Bhatt : సినిమా కోసం ప్రోడ్యూసర్‌కు మంత్రించిన మాంసం తినిపించిన ఫిలింమేకర్
చిన్నప్పటినుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు.. వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని పల్లె జీవన విధానం, గ్రామాలలో ఉండే ప్రేమ ఆప్యాయతలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాడు. అతను స్థానికంగా గడ్డం రాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
