ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో బస్సులోని 13 మృతి చెందారు.. అదే విధంగా మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు.. బస్సులో ప్రయాణిస్తున్న మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి..
వివరాల్లోకి వెళితే.. గుణ-ఆరోన్ రహదారిపై డంపర్‌ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని, ప్రమాదానికి కారణాన్ని కనుగొనడానికి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా యంత్రాంగం చెబుతున్నారు..
ఈ ప్రమాదం నుంచి బయట పడిన మరో నలుగురు క్షేమంగా ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 సహాయం ప్రకటించారు.. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
