NTV Telugu Site icon

దారుణం: కన్న కూతురినే కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకుతో కలిసి ఆమెను

రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌‌లోని షాజహాన్‌పూర్ ప్రాంతానికి చెందిన బుద్ధపాల్ సక్సేనాకు ఒక కొడుకు, ఒక కూతురు రోషిణి..ఆమె అదే గ్రామానికి చెందిన ప్రభాత్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు వారి కులం కాకపోవడంతో వారి పెళ్ళికి ఒప్పుకోరని తెలిసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇటీవల్ ఆ విషయం తెలుసుకున్నా బుద్ధపాల్ సక్సేనా అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. బయట ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువుపోతుందని దారుణానికి ఒడిగట్టాడు. తన కొడుకు, మరో ఇద్దరు బంధువుల సహాయంతో రోషిణిని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం పక్కనే నిర్మానుష్య ప్రదేశంలో శవాన్ని కాల్చి బూడిద చేశారు.

తెల్లారి కూతురు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడగగా కూతురు ప్రియుడు ప్రభాత్ పేరు చెప్పాడు. దీంతో అతడిని పోలీసులు విచారించగా అతడు జరిగిందంతా వివరించాడు. ఇక రోషిని తండ్రి అనుమానిత తీరును అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో ప్రశ్నించగా నిజం బయటపెట్టాడు. తన కూతురు ప్రభాత్ ని ప్రేమించి తమకు తెలియకుండా పెళ్లి చేసుకుందని, అందుకే కూతురును చంపానని ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి, కొడుకు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Show comments