Site icon NTV Telugu

Father kills son: చదువుకోవడం లేదని కొడుకుని చంపిన తండ్రి..

Father Kills Son

Father Kills Son

Father kills son: చదువుకునేందుకు నిరాకరించినందుకు తన 14 ఏళ్ల కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ ఘటనపై కేఎస్ లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తేజస్ అనే పిల్లాడు పాఠశాలకు వెళ్లడం మానేయడంతో పాటు చదువుని నిర్లక్ష్యం చేసినందు కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..

తేజస్ చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు అప్పుడప్పుడు మాత్రమే స్కూల్‌కి వెళ్లేవాడు. చెడు స్నేహాలతో చదువుల్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో తండ్రి తరుచుగా అతడిపై అసంతృప్తి వ్యక్తం చేసేవాడు. ఈ విషయమై శుక్రవారం రాత్రి తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో కొడుకుని చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొడుకును హత్య చేసినందుకు తండ్రిని అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది.

Exit mobile version