Site icon NTV Telugu

వీడు తండ్రి కాదు క్రూరుడు.. పసిబిడ్డ అని కూడా చూడకుండా

సమాజంలో ఇంకా ఆడవారిపై వివక్ష ఉందని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఆడ, మగ సమానమేనని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంటే.. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టారని వారిని చంపేస్తున్నారు.. ఆడపిల్లలను ఎందుకు కన్నవాని భార్యలను వేధిస్తున్నారు. తాజాగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో పుట్టిన పసిబిడ్డను నేలకేసి కొట్టి హతమార్చాడు. ఈ క్రూరమైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపూరావు అనే వ్యక్తికి మహారాష్ట్రకి చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే మొదటినుంచి ఆడపిల్లలు ఇష్టం లేని బాపూరావు మూడో కాన్పులో కూడా భార్య ఆడపిల్లకు జన్మనివ్వడంతో కోపంతో ఊగిపోయాడు. భార్యను అనరాని మాటలు అని, ఆమెను చిత్రహింసలు పెట్టాడు.. ఇంకా కోపం తగ్గని అతను కోపంలో క్రూరంగా ప్రవర్తించాడు. 38 రోజుల పసికందును తల్లి ఒడిలో నుంచి లాక్కొని నేలకేసి కొట్టాడు. దీంతో పసికందు అక్కడిక్కడే మృతిచెందింది. భర్త చేసిన దారుణాన్ని భార్య పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు

Exit mobile version