కర్ణాటకలోని మైసూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతులు మైసూర్‌కు చెందిన చేతన్ (45), భార్య రూపాలి (43), కుమారుడు కుషన్ (15), తల్లి ప్రియంవద (65) గా గుర్తించారు. భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపిన తర్వాత చేతన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వీళ్లంతా విశ్వేశ్వరయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు ముందు అమెరికాలో ఉంటున్న సోదరుడికి ఫోన్ చేసి అప్పుల బాధతో చనిపోతున్నట్లుగా కాల్ చేసి కట్ చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Amardeep Kumar: రూ.1700 కోట్లతో దుబాయ్కి పారిపోయిన ఫాల్కన్ చైర్మన్
మైసూరు నగర పోలీసు కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ ఎస్ జాహ్నవితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కుటుంబం రెండు ఫ్లాట్లలో ఉంటున్నారని తెలిపారు. నలుగురు రెండు ఫ్లాట్‌లో శవాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. చేతన్ దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మెకానికల్ ఇంజనీర్ చేతన్ పశ్చిమాసియాలో పనిచేసి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఆదివారం గోరూర్‌లోని ఒక ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా.. మైసూరులోని భార్య రూపాలి ఇంటికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చే ముందు భోజనం చేశారని పోలీసు అధికారి తెలిపారు. విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత పదేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MLC Srinivas Reddy: కోడి పందేలుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్సీ