Hyderabad: పాతబస్తీలో నకిలీ బాబా.. బాలికను ట్రాప్ చేసి ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad:బాబా అవతారం ఎత్తిన కేటుగాడు.. వైద్యం కోసం వచ్చిన బాలికను ట్రాప్ చేశాడు. బాలిక పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంట్లో నిర్బంధించాడు. పెళ్లై.. ఇద్దరు పిల్లలున్న బురిడీ బాబా… ఆ బాలికను ఇప్పుడు తన భార్య అంటున్నాడు. తమ కూతురును ట్రాప్ చేశాడని.. జీవితం నాశనం చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించారు బాలిక పేరెంట్స్. బాబాకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసే తనను పెళ్లి చేసుకున్నానని.. పరిచయమైన 2 నెలలకే బాబాతో ప్రేమలో పడిపోయానని చెప్తోంది బాలిక.
READ MORE: Fake PMO Letter Scam: చీటింగ్ చేయడం కోసం ప్రధాని కార్యాలయాన్ని వాడుకున్న వ్యక్తి.. కట్‌చేస్తే..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
గల్లీ గల్లీకో బాబా… ఓ చేతిలో నెమలి ఈకల కట్ట.. మరో చేతిలో ఊదు దీపం పట్టుకుని.. మంచి అడ్డా చూసుకుని బాబా అవతారం ఎత్తేస్తున్నారు. అమాయక జనాలు కూడా ఇలాంటి బాబాలనే గుడ్డిగా నమ్మేస్తున్నారు.. ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పినా చెవికెక్కించుకోరు కానీ.. ఇలాంటి బాబాలు ఒక్క మాట చెప్తే చాలు.. నిప్పుల్లో దూకమన్నా దూకేసే అమాయక జనాలు ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ బురిడీ బాబాకి బలైంది ఓ బాలిక. తన బంగారు భవిష్యత్తును బాబాకి ఫణంగా పెట్టేసింది అమాయక బాలిక. మహారాష్ట్ర లోని పూణెకి చెందిన ఈ బాలికకు కొన్ని నెలలుగా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో బంధువుల మాటలు విని హైదరాబాద్‌లోని ఓ బాబాను ఆశ్రయించారు. పాతబస్తీ పరిధిలోని శాలిబండ నవాబ్ సాహెబ్ కుంటలో ఉండే ఓ బాబా దగ్గరికి వచ్చారు. తమ కూతురి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. మంత్రాలతో మంత్రిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని మాయమాటలు చెప్పాడు. గుడ్డిగా నమ్మిన బాలిక తల్లిదండ్రులు.. బాలికను తరుచూ బాబా దగ్గరికి పంపారు. ఇదే అదునుగా ఆ బురిడీ బాబా.. బాలికను ట్రాప్ చేశాడు. తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు..
READ MORE: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు
బాలికకు పూర్తిగా నయమైందని.. దర్గాకి తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని.. ఓ రోజు బాలికను తన వెంటపెట్టుకుని తీసుకెళ్లాడు. వెంట తల్లిదండ్రులు వస్తామన్నా నిరాకరించాడు. దర్గాకి తీసుకెళ్లి.. బాలికను పెళ్లి చేసుకున్నాడు బురిడీ బాబా. సాయంత్రం అవుతున్నా.. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందారు బాలిక పేరెంట్స్. బాబా ఇంటికి వెళ్లి చూడగా.. షాక్ అయ్యారు. బాబా, తమ కూతురు ఇద్దరూ మెడలో దండలతో దర్శనమిచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పారు. బాలిక కూడా… బాబాతో ప్రేమలో పడ్డానని, తాను ఇప్పుడు మైనర్‌ని కాదు, మేజర్‌ను అని చెప్తోంది.. బాబాకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా తెలుసని.. అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నాను అని చెప్తోంది బాలిక. దీంతో బాలిక పేరెంట్స్ శాలిబండ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!