Site icon NTV Telugu

Hyderabad: పాతబస్తీలో నకిలీ బాబా.. బాలికను ట్రాప్‌ చేసి ఏం చేశాడంటే..?

Hyd

Hyd

Hyderabad:బాబా అవతారం ఎత్తిన కేటుగాడు.. వైద్యం కోసం వచ్చిన బాలికను ట్రాప్‌ చేశాడు. బాలిక పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంట్లో నిర్బంధించాడు. పెళ్లై.. ఇద్దరు పిల్లలున్న బురిడీ బాబా… ఆ బాలికను ఇప్పుడు తన భార్య అంటున్నాడు. తమ కూతురును ట్రాప్‌ చేశాడని.. జీవితం నాశనం చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించారు బాలిక పేరెంట్స్‌. బాబాకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసే తనను పెళ్లి చేసుకున్నానని.. పరిచయమైన 2 నెలలకే బాబాతో ప్రేమలో పడిపోయానని చెప్తోంది బాలిక.

READ MORE: Fake PMO Letter Scam: చీటింగ్ చేయడం కోసం ప్రధాని కార్యాలయాన్ని వాడుకున్న వ్యక్తి.. కట్‌చేస్తే..

గల్లీ గల్లీకో బాబా… ఓ చేతిలో నెమలి ఈకల కట్ట.. మరో చేతిలో ఊదు దీపం పట్టుకుని.. మంచి అడ్డా చూసుకుని బాబా అవతారం ఎత్తేస్తున్నారు. అమాయక జనాలు కూడా ఇలాంటి బాబాలనే గుడ్డిగా నమ్మేస్తున్నారు.. ఎంబీబీఎస్‌ డాక్టర్‌ చెప్పినా చెవికెక్కించుకోరు కానీ.. ఇలాంటి బాబాలు ఒక్క మాట చెప్తే చాలు.. నిప్పుల్లో దూకమన్నా దూకేసే అమాయక జనాలు ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ బురిడీ బాబాకి బలైంది ఓ బాలిక. తన బంగారు భవిష్యత్తును బాబాకి ఫణంగా పెట్టేసింది అమాయక బాలిక. మహారాష్ట్ర లోని పూణెకి చెందిన ఈ బాలికకు కొన్ని నెలలుగా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో బంధువుల మాటలు విని హైదరాబాద్‌లోని ఓ బాబాను ఆశ్రయించారు. పాతబస్తీ పరిధిలోని శాలిబండ నవాబ్‌ సాహెబ్‌ కుంటలో ఉండే ఓ బాబా దగ్గరికి వచ్చారు. తమ కూతురి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. మంత్రాలతో మంత్రిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని మాయమాటలు చెప్పాడు. గుడ్డిగా నమ్మిన బాలిక తల్లిదండ్రులు.. బాలికను తరుచూ బాబా దగ్గరికి పంపారు. ఇదే అదునుగా ఆ బురిడీ బాబా.. బాలికను ట్రాప్‌ చేశాడు. తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు..

READ MORE: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు

బాలికకు పూర్తిగా నయమైందని.. దర్గాకి తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని.. ఓ రోజు బాలికను తన వెంటపెట్టుకుని తీసుకెళ్లాడు. వెంట తల్లిదండ్రులు వస్తామన్నా నిరాకరించాడు. దర్గాకి తీసుకెళ్లి.. బాలికను పెళ్లి చేసుకున్నాడు బురిడీ బాబా. సాయంత్రం అవుతున్నా.. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందారు బాలిక పేరెంట్స్‌. బాబా ఇంటికి వెళ్లి చూడగా.. షాక్‌ అయ్యారు. బాబా, తమ కూతురు ఇద్దరూ మెడలో దండలతో దర్శనమిచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పారు. బాలిక కూడా… బాబాతో ప్రేమలో పడ్డానని, తాను ఇప్పుడు మైనర్‌ని కాదు, మేజర్‌ను అని చెప్తోంది.. బాబాకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా తెలుసని.. అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నాను అని చెప్తోంది బాలిక. దీంతో బాలిక పేరెంట్స్‌ శాలిబండ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

Exit mobile version