వివాహేతర సంబంధాలు అటు ఇద్దరు వ్యక్తుల్నే కాదు.. ఆ కుటుంబాలను కూడా ఛిద్రం చేస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా బలయిపోతున్నారు. భార్య వివాహేతర సంబంధం తట్టుకోలేక కొడుకుతో సహా తండ్రి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య వివాహేతర సంబంధం కళ్ళారా చూసిన భర్త తట్టుకోలేక తన ఏడేళ్ల కొడుకుతో కలిసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం రేమిడిచర్ల రైల్వే గేట్ సమీపంలో కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చెందిన తన్నీరు రామారావు తన ఏడేళ్ల కొడుకు గోపిచంద్ తో కలిసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also: T20 World Cup: స్టోయినిస్ తాండవం.. శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం
ఈ అఘాయిత్యానికి అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణం. రెండు రోజుల క్రితం తన భార్య అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి ఉండడాన్ని కళ్ళారా చూసిన భర్త తట్టుకోలేక ఆవేదనకు గురై ,బతుకుపై విరక్తి చెంది ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఇంతలో తన ఏడేళ్ల కొడుకు అనాథ అవుతాడేమోనని భయపడి కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. తన భార్య అక్రమ సంబంధం విషయం బంధువులకు చెప్పి కొడుకును తీసుకొని రేమిడిచర్ల రైల్వే గేట్ సమీపంలో గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తండ్రి కొడుకుల శరీర భాగాలు ఛిద్రమై చల్లాచెదురయ్యాయి. ఈ దృశ్యాలు చూసే వారిని కంటతడి పెట్టించాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Worlds Most Dirtiest Man Died: ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి కన్నుమూత
