Site icon NTV Telugu

Divya Pahuja: కాలువలో దొరికిన మోడల్ దివ్య పహుజా డెడ్‌బాడీ..

Divya Pahuja

Divya Pahuja

Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హర్యానాలోని ఓ హోటల్ గదిలో ఆమెను హత్య చేసి, డెడ్‌బాడీని ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిందితులు డెడ్‌బాడీని ఎక్కడ పారేశారనే విషయంపై పోలసీులు గత కొన్ని వారాలుగా వెతుకుతున్నారు. చివరకు ఓ కాలువలో కుళ్లిపోయిన స్థితితో దివ్యపహుజా మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసిన తర్వాత పొరుగున ఉన్న పంజాబ్‌లోని కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. జనవరి 1న గురుగ్రామ్ లోని ఓ హోటల్‌లో పహుజాను హోటల్ ఓనర్ అభిజీత్ సింగ్ హత్య చేశాడు. హత్యకు సహకరించిన బాల్‌రాజ్ గిల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని గురుగ్రామ్‌కి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటియాలాలో పారేసినట్లు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కాలువలో డెడ్‌బాడీని గుర్తించారు. శరీరం వెనక ఉన్న టాటూ ద్వారా పహుజానే తెలుసుకోగలిగారు.

Read Also: POK: పీఓకేలో పర్యటించిన బ్రిటిష్ రాయబారి.. భారత్ తీవ్ర అభ్యంతరం..

జనవరి 1న దివ్య పహుజా హత్యకు గురైంది. ఐదుగురు వ్యక్తులు 27 ఏళ్ల పహుజాని హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. హోటల్ యజమాని అభిజీత్ సింగ్‌కి సంబంధించి కొన్ని అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు పహుజా ఫోన్‌లో ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరినా, అందుకు నిరాకరించడంతోనే ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలతో పహుజా బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను హత్య చేసేందుకు మరో నిందితుడు, ప్రధాన నిందితుడైన అభిజీత్ సింగ్‌కి తుపాకీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దివ్య పహుజా 2016లో అప్పటి తన ప్రియుడు మరియు గురుగ్రామ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ యొక్క బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలతో జైలులో ఉన్నారు. ఆమెకు గత ఏడాది జూన్‌లో బెయిల్ మంజూరైంది.

Exit mobile version