Fake Bomb Threat: ఓ మందుబాబు చేసిన తుంటరి పనికి దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆగింది. ఆగిపోవడమే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే.. శనివారం నాడు తన కుటుంబ సభ్యులను దేశం నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ఓ తాగుబోతు.. దుబాయ్‌కి వెళ్లే ఓ ప్రైవేట్ క్యారియర్‌కు బూటకపు బాంబు బెదిరింపు చేసి పోలీసుల వలలో పడ్డాడు. తన కుటుంబ సభ్యులలో ఇద్దరు దుబాయ్‌కి వెళ్తున్నారు. అయితే వాళ్లు ఆ రోజు దుబాయ్‌కి వెళ్లడం తాగుబోతుకు ఇష్టం లేదు. కానీ అతని మాట పట్టించుకోకుండా వారు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. వారిని ఎలాగైనా ఆపాలనుకున్న మందుబాబు.. సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేశాడు. సదరు విమానంలో బాంబు ఉందని చెప్పాడు.
Fire on Home: వీడేం దొంగ.. విలువైనవి దొరకలేదని ఇంటికి నిప్పు
దీనితో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి బాంబు కోసం గాలించారు. వాస్తవానికి 7.20కి బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో భద్రతా ఏజెన్సీలు పూర్తి స్థాయి శోధనను ప్రారంభించాయి. చివరికి అలాంటిదేమీ లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం విమానం ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.
అనంతరం ఈ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీయగా.. ఈ తాగుబోతును గుర్తించారు. తన కుటుంబసభ్యులను దుబాయ్‌కు వెళ్లుకండా ఆపాలనే ఈ కాల్ చేసినట్లు ఆ వ్యక్తి చల్లగా చెప్పాడు. దీంతో ముక్కున వేలేసుకోవడం పోలీసుల వంతయింది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
