ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా భార్య మటన్ వండమంటే వండలేదు.. ఆమెపై కేసు రాసుకోండి అని చెప్పుకొచ్చాడు.
ఇక ఇది సిల్లీ విషయమని పోలీసులు లైట్ తీసుకొని వదిలేశారు. అయినా నవీన్ వదలలేదు.. వరుసగా ఆరుసార్లు ఫోన్ చేసి విసిగించాడు. దీంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్లి చూడగా అక్కడ మద్యంమత్తులో నవీన్ ని చూసి , భార్యను విషయం అడిగారు. ఆమె జరిగింది చెప్పడంతో వారు వెనుతిరిగారు. ఇక పోలీసులను ఇబ్బంది పెట్టినందుకు అతడిపై కేసు నమోదు చేసి ఆదివారం తడిని అరెస్ట్ చేశారు. ఇబ్బందిలో ఉన్నవారు 100 కి దయాల్ చేస్తూ ఉంటారని, అలంటి సమయంలో ఇలాంటి సిల్లీ విషయాలతో పోలీసుల టైమ్ ని వేస్ట్ చేసినందుకు అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.