NTV Telugu Site icon

Actress Nakshathra: అర్థరాత్రి బస్సులో డ్రైవర్ నీచ పని.. ఆ నటి ఏం చేసిందంటే?

Nakshatra Sister Harassed

Nakshatra Sister Harassed

Driver Harassed Actress Nakshathra Sister In Bus: ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా.. కామాంధుల్లో మార్పు రాకపోగా, మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ బస్సు డ్రైవర్ కూడా అలాంటి నీచ పనే చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతగాడు.. బస్సులోనే ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తెలివిగా ప్రదర్శించి, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

‘వల్లి తిరుమనం, యారది నీ మోహిని’ వంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటి నక్షత్ర సోదరి ఇటీవల చెన్నై నుంచి కేరళలోని తన స్వస్థలానికి బయలుదేరింది. ఓ ప్రైవేట్ బస్సెక్కిన ఆమె జర్నీ.. మొదట్లో సాఫీగానే సాగింది. అయితే.. అర్థరాత్రి నిద్రపోయాక ఆమెకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత.. ఆ బస్సులో ఉండే రెండో డ్రైవర్, ఆమెను అసభ్యంగా తాకాడు. వెంటనే తేరుకున్న ఆమె.. ఏం చేస్తున్నావని అతడ్ని గట్టిగా నిలదీసింది. దాంతో భయపడిపోయిన ఆ డ్రైవర్.. పొరపాటున చెయ్యి తగిలిందంటూ తన తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు.

కానీ.. అతడు తప్పుగానే ప్రవర్తించాడని ఆ అమ్మాయి బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులకు చెప్పింది. దీంతో.. ఆ బస్సులో ఉన్న ఇతర మహిళలు సైతం, ఆ డ్రైవర్‌ తమతో కూడా అలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. ఇంకేముంది, అందరూ కలిసి అతనికి గట్టిగా క్లాస్ పీకారు. ఆ దెబ్బకు అతడు మళ్లీ వాళ్ల జోలికి వెళ్లలేదు. ఈ విషయాన్ని తన సోదరి నక్షత్రకు తెలియజేయగా.. ఆమె మొత్తం తతంగాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ బస్సు డ్రైవర్ ఫోటో కూడా షేర్ చేస్తూ.. అతనిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌లను ట్యాగ్‌ చేసింది.

Show comments