Site icon NTV Telugu

Drug Factory: ఇది చూసి.. బాలామృతం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకే…

Untitled Design (19)

Untitled Design (19)

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉక్కపాదం మోపింది. “ఆపరేషన్ వైట్ కౌల్డ్రాన్” చేపట్టి 22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కీలక ఫైనాన్షియర్లు, తయారీదారులు అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.

Read Also: PAN-Aadhaar Linking : పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేశారా.. వచ్చే నెలే లాస్ట్…

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు అవుతున్నాయి. పైకి చూసి అదేదో బాలామృతం లేదా శెనగపిండి అనుకునేరు.. తీరా లోపలికి వెళ్లిన పోలీసులు కూడా షాకయ్యారు. అక్కడ జరుగుతున్నది చూసి కంగుతిన్నారు. ముంబై DRI అధికారులు గుజరాత్ రాష్ట్ర రహదారి 701కి దూరంగా ఉన్న ఏకాంత ప్రాంతంలో ఉన్న ఒక అనుమానిత సౌకర్యంపై నిఘా ఉంచి.. పారిశ్రామిక స్థాయి యంత్రాలతో కూడిన పూర్తి స్థాయి అక్రమ తయారీ యూనిట్‌ గుట్టు రట్టు చేశారు.

Read Also:Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త

గుజరాత్ రాష్ట్రం వలసాడ్ జిల్లాలో గుట్టుగా వ్యాపారం చేస్తున్న ఇందుకు సంబంధించిన ముఠాను ‘అలర్ట్- డీఆర్ఐ(DRI) ఆపరేషన్ వైట్ కాడ్రన్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 9.55 కిలోల పూర్తయిన అల్ప్రజోలం, 104.15 కిలోల సెమీ-ఫినిష్డ్ అల్ప్రజోలం, దాదాపు 431 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో p-నైట్రోక్లోరోబెంజీన్, ఫాస్ఫరస్ పెంటాసల్ఫైడ్, ఇథైల్ అసిటేట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి కీలకమైన రసాయనాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో రియాక్టర్లు, సెంట్రిఫ్యూజ్‌లు, శీతలీకరణ యూనిట్లు, ఇతర పారిశ్రామిక ప్రాసెసింగ్ పరికరాలు కూడా ఉన్నాయి.

Read Also:Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది

గుజరాత్ రాష్ట్ర రహదారికి దూరంగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను బట్టి డీఆర్ఐ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పర్యవేక్షణ నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీపై దాడులు చేపట్టారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు బయటపడ్డాయి. పైగా ఇది తయారుచేస్తున్న ముఠా కొద్ది కాలంగా ఇదే వ్యాపారం చేస్తూ.. విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కీలక ఫైనాన్షియర్లు, తయారీదారులు, అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులనుఅరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్టు అధికారులు గురించారు.

Exit mobile version