హైదరాబాద్ లో ఓ వైద్యుడు హోటల్లో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు పంకజ్ కుమార్ జైన్ కుమార్తె అనుపమ జైన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల నివాసం ఎదురుగా ఉన్న లాండ్ మార్క్ హోటల్ లో వైద్యుడి దుర్మరణం వివాదాస్పదం అవుతోంది.
తన కుమార్తె వివాహ విషయమై నగరానికి వచ్చిన ఇండోర్ కు చెందిన వైద్యుడు పవన్ కుమార్ జైన్ (60) బసచేసిన ల్యాండ్ మార్క్ హోటల్లోని ఆరో అంతస్తులో నుంచి క్రింద పడి మృతి చెందారు. పంకజ్ కుమార్ జైన్ కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చారు. శుక్రవారం ఉదయం ల్యాండ్ మార్క్ హోటల్లోని 302, 404 గదులను తీసుకున్నారు. పనులు ముగించుకుని ఎనిమిది గంటల ప్రాంతంలో తిరిగి హోటల్ గదికి చేరుకున్నారు.
శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆరో అంతస్తులోకి వెళ్లిన పవన్ కుమార్ జైన్ ఎలాంటి రక్షణ లేని లిఫ్ట్ గుంతలో కాలు వేసి కింద పడిపోయాడు. హోటల్ యాజమాన్యం ఆరవ అంతస్తులోని లిఫ్ట్ గుంతకు రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే తన తండ్రి గుంతలో పడి దుర్మరణం చెందాడని ఈ విషయమై తమకు న్యాయం చేయాలని పంకజ్ కుమార్ జైన్ కుమార్తె అనుపమ జైన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
