Site icon NTV Telugu

ఒమిక్రాన్ భయం.. భార్యాపిల్లలను అతిదారుణంగా చంపిన డాక్టర్

doctor

doctor

మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారంలాంటి కుటుంబాన్ని తన చేతులారా చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్ కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించాడు.. ఇక ఇటీవల ఒమిక్రాన్ వైరస్ వస్తుందని తెలియడంతో దానిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు.. అందులో ఒమిక్రాన్ కి మందు లేదని తెలుసుకున్నాడు.. అప్పటినుంచి అతనిలో చావు భయం మొదలయ్యింది.

భార్య పిల్లలకు ఒమిక్రాన్ వస్తే తానూ సాయం చేయలేనని , కాపాడుకోలేనని భయపడి దారుణ ప్లాన్ వేశాడు. తన కళ్ళముందే భార్యాపిల్లలు కొద్దికొద్దిగా చనిపోవడం చూడలేనని అనుకోని భార్యాపిల్లల గొంతుకోసి హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. డాక్టర్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని పోలీసులు తెలుపుతున్నారు.

Exit mobile version