Site icon NTV Telugu

Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…

Untitled Design (6)

Untitled Design (6)

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఒక వృద్ధుడిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. పెద్దమనిషని కూడా చూడకుండా ఓ యువకుడు అతడిపై చాలా దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ సంఘటన ఆగ్నేయ ఢిల్లీలోని అలీగావ్‌లో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనతో శాంతిభద్రతలపై పలు విమర్శలకు తావిస్తోంది.

Read Also: Teacher Attacked School Boy: పిల్లల మధ్య వివాదం.. మధ్యలో దూరిన టీచర్ ఏం చేశాడో తెలుసా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 24న, రఘురాజ్ అనే పెద్దాయన ఇంటి నుండి ఆఫీసుకు తన కారులో వెళుతుండగా.. మోహిత్ అతని స్నేహితులు వచ్చి, మొదట రఘురాజ్ కారు అద్దాన్ని పగలగొట్టారు. తరువాత, వారు అతన్ని కారులోంచి బయటకు లాగి కొట్టడం ప్రారంభించారు. ఈ దాడిలో రఘురాజ్ రెండు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Man Attacked by Old Women:ఎవడ్రా నువ్వు.. వృద్ధురాలిపై దాడి చేసిన సర్పంచ్ భర్త..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహిత్ రెండు సంవత్సరాల క్రితం అలిగావ్‌లో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసి నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే ఒక నెల తర్వాత డీడీఎ దానిని కూల్చివేసింది. రఘురాజ్ తనపై DDA కి ఫిర్యాదు చేశాడని మోహిత్ అనుమానించాడు. దీనితో అతను రఘురాజ్ పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని సరితా బీహార్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి మోహిత్, అతని సహచరుల కోసం వెతుకుతున్నారు. బాధితుడు రఘురాజ్‌ను వీధి మధ్యలో కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ వ్యక్తిని కర్రలతో కొడుతున్నట్లు కనిపిస్తోంది. పక్కనే ఉన్నవారు నిరసన వ్యక్తం చేయడంతో.. నిందితులు వారిని కూడా బెదిరించారు.

Exit mobile version