Site icon NTV Telugu

Jacqueline Fernandez: ముచ్చటగా మూడోసారి బాలీవుడ్‌ బ్యూటీకి నోటీసులు.. ఈ సారైనా..?

Jacqueline Fernandez

Jacqueline Fernandez

మరోసారి బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. సుఖేశ్ చంద్రశేఖ‌ర్ మనీ లాండరింగ్‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో… సమన్లు ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 14న విచారణకు హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో ఆదేశించారు. జాక్వెలిన్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది మూడో సారి. గ‌తంలో రెండు సార్లు స‌మ‌న్లు జారీ చేసినా.. బిజీ షెడ్యూల్ వల్ల విస్మరించానని చెప్పుకొచ్చింది జాక్వెలిన్‌. సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి నడిపించిన దోపిడీ దందాపై జాక్వెలిన్‌ను ప్రశ్నించనున్నారు ఢిల్లీ పోలీసులు.

Read Also: Astrology : సెప్టెంబర్‌ 13, మంగళవారం దినఫలాలు

కాగా, మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలు బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Exit mobile version