దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. నిలబడి ఉన్న మరో వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను వెంబడించిన మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా చనిపోయాడు. ఒకేరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ChatGPT Search Engine: గూగుల్‌కు చెక్ పెట్టేందుకు చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్ రెడీ..
గురువారం దీపావళి సందర్భంగా ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో ఓ కుటంబం ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఆకాశ్ శర్మ (44), మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (15) ఇంటి ముందు దీపావళి టపాసులు కాలుస్తున్నారు. అప్పుడే ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి ముందు ఆగి నమ్మకంగా నటించారు. కానీ జరగబోయే విపత్తును ఆకాశ్ శర్మ ఊహించలేకపోయాడు. పిల్లలు టపాసులు వెలిగిస్తుండగా.. ఆకాశ్ శర్మ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో నిందితుల్లో ఒకడు తుపాకీ తీసుకుని ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. గేటు దగ్గరే చనిపోయాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్న పిల్లలు షాక్ అయ్యారు. పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా మేనల్లుడిపై కూడా కాల్పులు జరపడంతో రిషబ్ శర్మ కూడా చనిపోయాడు. కుమారుడు క్రిష్ శర్మ గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ?
దూరపు బంధువైన యువకుడు ఆకాశ్ శర్మకు నెల రోజుల క్రితం రూ.70,000 అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మృతుడిపై ఇదే వరకే కేసు నమోదైందని వెల్లడించారు. ఇక ఈ కేసులో నిందితుల్లో ఒకరైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కోసం యువకుడు సుపారీ ఇచ్చి షూటర్‌ను నియమించుకున్నాడు. నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024