NTV Telugu Site icon

Delhi : ప్రాణం తీసిన రూ.3000.. నడి రోడ్డుపై వెంటాడి.. వెంటాడి పొడిచి..

Delhi (2)

Delhi (2)

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తి అతి దారుణంగా వెంటాడి.. వెంటాడి పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. దారుణాన్ని అక్కడి వారు చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. చివరికి కొందరూ వ్యక్తులు ఆ నిందితుడిపై కర్రలతో దాడి చేసి.. పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన అనంతరం కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ.. కేవలం రూ.3000 కోసం ఆ యువకుడిని  పొడిచి చంపానని పోలీసులకు వెల్లడించాడు. మృతుడిని యూసుఫ్ అలీగా గుర్తించారు.

ఈ ఘటనకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలోని సంగం విహార్‌కు చెందిన యూసఫ్ అలీకి షారుఖ్ అనే వ్యక్తి రూ.3,000 లను అప్పుగా ఇచ్చాడు. అయితే.. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా.. సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట యూసఫ్‌కు షారుఖ్‌ వార్నింగ్ ఇచ్చాడు. అయినా డబ్బులు చెల్లించకుండా మొకం చాటేశాడు. దీంతో ఆగ్రహించిన షారుక్ బుధవారం ఉదయం ఓ షాపు వద్ద ఉన్న అలీ ని చూసి షారుక్ కోపంతో రగిలి పోయాడు..

యూసుఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఆకస్మిక దాడిలో యూసుఫ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. చుట్టుపక్కల ఉన్న వారు చూస్తునే ఉన్నారు. తప్ప .. ఆ దారుణాన్ని ఆపలేకపోయారు. చివరికి కొందరూ వ్యక్తులు ధైర్యం చేసి హంతకుడి కర్రలతో కొట్టి అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. జనం కొట్టడంతో నిందితుడు కూడా స్పృహతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ దారుణం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.. కత్తి పోట్లు బాగా దిగడంతో అతను మరణించారు.. ఇక షారుఖ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

Show comments