Delhi : ప్రాణం తీసిన రూ.3000.. నడి రోడ్డుపై వెంటాడి.. వెంటాడి పొడిచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తి అతి దారుణంగా వెంటాడి.. వెంటాడి పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. దారుణాన్ని అక్కడి వారు చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. చివరికి కొందరూ వ్యక్తులు ఆ నిందితుడిపై కర్రలతో దాడి చేసి.. పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన అనంతరం కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ.. కేవలం రూ.3000 కోసం ఆ యువకుడిని పొడిచి చంపానని పోలీసులకు వెల్లడించాడు. మృతుడిని యూసుఫ్ అలీగా గుర్తించారు.
ఈ ఘటనకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలోని సంగం విహార్‌కు చెందిన యూసఫ్ అలీకి షారుఖ్ అనే వ్యక్తి రూ.3,000 లను అప్పుగా ఇచ్చాడు. అయితే.. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా.. సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట యూసఫ్‌కు షారుఖ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా డబ్బులు చెల్లించకుండా మొకం చాటేశాడు. దీంతో ఆగ్రహించిన షారుక్ బుధవారం ఉదయం ఓ షాపు వద్ద ఉన్న అలీ ని చూసి షారుక్ కోపంతో రగిలి పోయాడు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
యూసుఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఆకస్మిక దాడిలో యూసుఫ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. చుట్టుపక్కల ఉన్న వారు చూస్తునే ఉన్నారు. తప్ప .. ఆ దారుణాన్ని ఆపలేకపోయారు. చివరికి కొందరూ వ్యక్తులు ధైర్యం చేసి హంతకుడి కర్రలతో కొట్టి అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. జనం కొట్టడంతో నిందితుడు కూడా స్పృహతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ దారుణం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.. కత్తి పోట్లు బాగా దిగడంతో అతను మరణించారు.. ఇక షారుఖ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..
- Tags
- Crime News
- Delhi
- latest news
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!