NTV Telugu Site icon

Delhi: బాలికపై అమానుషం..పైలట్‌ దంపతులకు షాక్ ఇచ్చిన విమానాయన సంస్థ..

Pilot Women

Pilot Women

ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ బాలికను ఇంట్లో పెట్టుకొని పనిచేయించడంతో పాటు చిత్ర హింసలు పెట్టిన ఘటన వెలుగు చూసింది.. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.. దిల్లీ ద్వారక ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా పైలట్‌, ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అయిన ఆమె భర్త రెండునెలల క్రితం 10 ఏళ్ల బాలికను తమ ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆ దంపతులు ఆ అమ్మాయిపై కర్కషంగా ప్రవర్తించి గాయాలపాలు చేశారు.

ఆ సమయంలో ఆ బాలికను చూసేందుకు వచ్చిన బంధువు ఆమె ఒంటిపై గాయాలు ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న బంధువులు, స్థానికులు గుంపుగా వచ్చి ఫైలట్‌ దంపతులను రోడ్డుపైకి ఈడ్చి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది… ఈ ఘటన పై మండిపడ్డ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో మహిళా పైలట్‌ను విధుల్లోంచి తొలగించింది.

అదే విధంగా ఇక ఆమె భర్త పనిచేస్తున్న ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్‌ కూడా అతడిని ఉద్యోగం లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే ‘విస్తారా’ సంస్థ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ” విస్తారా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హింస ఘటన మా దృష్టికి వచ్చింది.. నిబంధనలను మేము పాటిస్తాం ఇలా చెయ్యడం అమానుషం అందుకే వారిని విధుల నుంచి తొలగించడం జరిగిందని ప్రముఖ సంస్థలు పేర్కొన్నారు.. 10 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకోవడంతో పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారని దంపతుల పై ఆరోపణలున్నాయి. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 324, 342, బాల కార్మిక చట్టం, 75 జేజే యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..