Delhi: బాలికపై అమానుషం..పైలట్ దంపతులకు షాక్ ఇచ్చిన విమానాయన సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ బాలికను ఇంట్లో పెట్టుకొని పనిచేయించడంతో పాటు చిత్ర హింసలు పెట్టిన ఘటన వెలుగు చూసింది.. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.. దిల్లీ ద్వారక ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళా పైలట్, ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అయిన ఆమె భర్త రెండునెలల క్రితం 10 ఏళ్ల బాలికను తమ ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆ దంపతులు ఆ అమ్మాయిపై కర్కషంగా ప్రవర్తించి గాయాలపాలు చేశారు.
ఆ సమయంలో ఆ బాలికను చూసేందుకు వచ్చిన బంధువు ఆమె ఒంటిపై గాయాలు ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న బంధువులు, స్థానికులు గుంపుగా వచ్చి ఫైలట్ దంపతులను రోడ్డుపైకి ఈడ్చి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది… ఈ ఘటన పై మండిపడ్డ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో మహిళా పైలట్‌ను విధుల్లోంచి తొలగించింది.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
అదే విధంగా ఇక ఆమె భర్త పనిచేస్తున్న ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్ కూడా అతడిని ఉద్యోగం లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే ‘విస్తారా’ సంస్థ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ” విస్తారా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హింస ఘటన మా దృష్టికి వచ్చింది.. నిబంధనలను మేము పాటిస్తాం ఇలా చెయ్యడం అమానుషం అందుకే వారిని విధుల నుంచి తొలగించడం జరిగిందని ప్రముఖ సంస్థలు పేర్కొన్నారు.. 10 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకోవడంతో పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారని దంపతుల పై ఆరోపణలున్నాయి. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 324, 342, బాల కార్మిక చట్టం, 75 జేజే యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
#WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi’s Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her.
The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z
— ANI (@ANI) July 19, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?