NTV Telugu Site icon

Swiss Woman Murder: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య.. మానవ అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు..

Crime News 1

Crime News 1

Swiss Woman Murder: ఢిల్లీలో ఇటీవల స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది. తిలక్ నగర్‌లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురుప్రత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళతో రిలేషన కలిగి ఉన్నట్లు పోలీసులు వచ్చారు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు వచ్చే విధంగా చేసి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన పడేశాడు. గతంలో గురుప్రీత్ సింగ్ స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు తరుచుగా నినా బెర్గర్ని కలిసేవాడు. సీసీ టీవీ ఫుటేజ్, కార్ నెంబర్ ఆధారంగా నిందితుడు గురుప్రీత్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో మానవ అక్రమ రవాణా కోణం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నిందితుడి సెల్ ఫోన్ లో డజన్ల కొద్దీ మహిళల ఫోటోలు, కాంటాక్టులు కనుగొన్నారు. అతని ఇంటి నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలో కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది.

Read Also: Honour Killing: దళిత యువకుడితో పారిపోయిందని కూతుర్ని నరికి చంపిన తండ్రి..

నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మూడు తుపాకులు, మందుగుండు సామాగ్రి, 12 సిమ్ కార్డులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించారు. ఈ హత్యకు ముందు సెక్స్ వర్కర్ ఆధార్ కార్డు ఉపయోగించి గురుప్రీత్ కారును కొనుగోలు చేశారు. నిందితుడు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఒమెగల్ చాటింగ్ యాప్ ద్వారా నినాతో కనెక్ట్ అయినట్లు గురుప్రీత్ సింగ్ పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు స్విట్జర్లాండ్ కు వెళ్లాడు. తాను నినాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతోనే చంపానని పోలీసులకు చెప్పాడు.