Delhi Bank Official Transfers 19 Crore Clients Money Into Own Account: తమ డబ్బులు భద్రంగా ఉంటాయన్న నమ్మకంతో జనాలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. బ్యాంకుల్లో ఉంటే ఆ డబ్బులు ఎక్కడికీ పోవని నమ్ముతారు. కానీ.. ఒక బ్యాంక్‌కి చెందిన మాజీ అధికారి మాత్రం ఇద్దరు ఖాతాదారుల నమ్మకాన్ని వమ్ము చేశాడు. వారికి చెందిన 19 కోట్లను తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. అయితే.. అతడు చేసిన నేరం ఆ వెంటనే తెలిసిపోవడంతో, పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Shamshabad Metro: శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ ముందస్తు కార్యక్రమాలు..
ఆ అధికారి పేరు నాగేంద్ర కుమార్. 2020 ఆగస్టు 7వ తేదీన ఇద్దరు ఖాతాదారులు తమ ఖాతాల్లో క్యాష్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేయగా.. నాగేంద్ర కుమార్ ఆ ఇద్దరు వ్యక్తుల ఖాతాల నుంచి రూ. 19.80 కోట్లను వివిధ బ్యాంకుల్లోని తన సొంత ఖాతాలకు బదిలీ చేసినట్లు అధికారులకి తెలిసింది. కుమార్ ఏయే బ్యాంకులకు ఆ నగదుని ట్రాన్స్ఫర్ చేశాడో.. ఆ బ్యాంకులని సంప్రదించి, అతని ఖాతాల నుంచి సొమ్ము రికవర్ చేసుకొని, బాధితుల ఖాతాల్లో తిరిగి జమ చేయడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ మీనా తెలిపారు. నాగేంద్ర కుమార్ తమ ఉద్యోగి అని, బారాఖంబా రోడ్ బ్రాంచ్‌లో అతడు విధులు నిర్వహించేవాడని బ్యాంక్ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు చేసిందని పోలీస్ అధికారి తెలిపారు.
Viral: అయ్యో దేవుడా.. కోరికలు ఇలా కూడా ఉంటాయా !
ఇంప్లిమెంటేషన్ & క్లయింట్ సపోర్ట్ విభాగంలో నాగేంద్ర కుమార్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున.. బ్యాంక్‌లోని హోస్ట్-టు-హోస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ (సెక్యూర్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్)లో చదవడానికి, రాయడానికి అనుమతులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2020 ఆగస్టు 7వ తేదీన అతడు ఎనిమిది ట్రాన్సాక్షన్‌లతో కూడిన రెండు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫైల్స్‌ని సృష్టించి, హోస్ట్-టు-హోస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోని ఈ కంపెనీల ఫోల్డర్‌కు అప్‌లోడ్ చేశాడన్నారు. ఆ తర్వాత క్యాష్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆటోమెటిగ్‌గా పేమెంట్ కోసం ఆ ఫైల్స్‌ని పంపిందన్నారు. మొత్తం బదిలీ అయ్యాక.. అదే రోజు సాయంత్రం 5.44 గంటలకు తన రాజీనామా పత్రాన్ని ఈమెయిల్ ద్వారా పంపించాడన్నారు. వసంత్ కుంజ్ ప్రాంతం నుంచి శుక్రవారం కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Minister Roja: పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్