Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ తన ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేశాడు. తన భార్య, తల్లితో పాటు ముగ్గురు కూతుళ్లను గొంతు కోసం హత్య చేశాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. పూజారి తన సొంత కుటుంబసభ్యులనే హత్య చేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్‌ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
గత ఏడేళ్లుగా మహేష్ కుమార్ తివారీ డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. కిరాతకంగా హత్య చేసిన అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ దారుణ ఘటన సోమవారం ఉదయం 7.30 గంటలకు జరిగింది. ఇంట్లో నుంచి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు తెలియజేయగా.. వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డాడనేది ఇంకా తెలియలేదని డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ కమలేష్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మృతులను తల్లి బితాన్ దేవి (75), భార్య నీతూ దేవి (36), కుమార్తెలు అపర్ణ (13), అన్నపూర్ణ (9), స్వర్ణ (11)గా గుర్తించారు.