Love jihad case: ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రం లవ్ జిహాద్ తో అట్టుడుకుతోంది. పురోలాలో కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడు మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే అదే రాష్ట్రంలో డబుల్ లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ముస్లిం అన్నతమ్ములు వారిని తమను తాము హిందువులుగా పరిచయం చేసుకుని, హిందూ పేర్లను ఉపయోగించి ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
యూపీ బిజ్నోర్ కు చెందిన ఇద్దరు అన్నాతమ్ములు, ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేశారు. మహ్మద్ సలీక్ పేరును లక్కీరాణాగా మార్చుకుని అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇతని తమ్ముడు కూడా హిందూ పేరును ఉపయోగించి మరో అమ్మాయితో ప్రేమ నటించాడు. బాలికలను నమ్మించేందుకు సలీక్ ఇటీవల విడుదలైన కేరళ స్టోరీ సినిమాకు తీసుకెళ్లి, హిందూ అమ్మాయిలను ముస్లింలు ఎలా ట్రాప్ చేస్తున్నారో చెబుతూ వారి నమ్మకాన్ని పొందారు. సలీక్ హిందువుగా నటిస్తూ పెళ్లి చేసుకుంటా అని చెబుతూ పలుమార్లు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు సలీక్ డెహ్రాడూన్ లో జూనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. ఇతని సోదరుడు బంగ్లాదేశ్ లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. చివరకు నిందితుడి తల్లిదండ్రులు కూడా కుట్రలో పాలుపంచుకున్నారు. వీరుకూడా తమను తాము హిందువులుగా అమ్మాయిలకు పరిచయం అయ్యారు. వీరిద్దరి పెళ్లికి ఇరు ఫ్యామిలీలు కూడా ఒప్పుకుని అక్టోబర్ 4న పెళ్లిని కూడా కుదుర్చుకున్నారు.
Read Also: Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
ఆన్‌లైన్ పేమెంట్‌తో కుట్ర బట్టబయలు..
వారం ముందు మహ్మద్ సలిక్ పండిత్వాడి ఏరియాలో ఒక ఇంటిని రెంట్ తీసుకున్నాడు. అయితే అతను ఓనర్ కి అడ్వాన్స్ చెల్లించేందుకు ఆన్‌లైన్ పేమెంట్ చేశాడు. ఇందులో అతని పేరు మహ్మద్ సలీక్ గా పడింది. అయితే ఓనర్ కు అంతకుముందు తన పేరు లక్కీ రాణా అని, తన తండ్రి పేరు దినేష్ రాణాగా పరిచయం చేసుకున్నాడు. కానీ ఆన్‌లైన్ పేమెంట్ తో అతని పేరు మహ్మద్ సలీక్ గా తేలింది. అనుమానం వచ్చిన ఓనర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ఇలా పేర్లను మార్చుకుని నాటకం ఆడుతున్నట్లు తేలింది.
ఆ తరువాత బాధిత అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ దిలీప్ సింగ్ కున్వర్ వెల్లడించారు. మొహల్లా చస్మ్రీన్ ఏరియా, బిజ్నోర్ జిల్లాకు చెందిన మహ్మద్ సలీక్ గా పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హిందూ యువతులే టార్గెట్ గా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న అతని తమ్ముడిని పోలీసులు ఈ విషయమై విచారించేందుకు పిలిచారు. నిందితుల తండ్రి బిజ్నోర్ లో అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాది కావడం విశేషం.