AP Crime: విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. మృతుడు సాయి తేజ.. ఎంవీపీలోని సమత కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. ఈ రోజు ఉదయం విద్యార్థి సాయి తేజ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు.. విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.. గత కొద్దిరోజుల నుంచి వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు చెబుతున్నారు.. మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.. కాలేజ్ వద్ద ఆందోళన చేస్తున్నారు తోటి విద్యార్థులు… కాగా, డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం.. కాలేజీ లెక్చర్‌పై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది..
Read Also: Jagadish Reddy : ఈ రౌడీయిజాలను.. బెదిరింపులను ప్రజలెప్పుడూ లెక్కపెట్టరు..
