Site icon NTV Telugu

Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్‌నర్” అరెస్ట్..

Crime

Crime

Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు.

Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..

అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వర్గాల ప్రకారం.. నిందితుడు కూతురు, ఆమె తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని, కుమార్తెతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వాగ్వాదంలో ఆమెను తోసేయడంతో తలకు గాయమైన ఆమె మరణించినట్లు అతను అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తండ్రి అపార్ట్‌మెంట్ లోపల మరణించి కనిపించాడు. అయితే, నిందితుడు చంపినట్లు అంగీకరించలేదని, అతను సహజకారణాల వల్లే మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఆమె మరణం తర్వాత అరెస్టు చేస్తారని భయపడిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. రెండు మృతదేహాలు కూడా 4-5 నెలల నుంచి అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాయి. కాంచీపురానికి చెందిన నిందితుడు వియన్నాలో మెడికల్ డిగ్రీ పొందాడు. మరణాలకు ఖచ్చితమైన కారణాలు, సమయాన్ని నిర్ణయించడానికి దర్యాప్తు అధికారులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

Exit mobile version