DB Stock Broking Scam: హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం..
- స్టాక్ బ్రేకింగ్ లో 7000 కోట్ల రూపాయల స్కాం పాల్పడ్డ డిబి కంపెనీ..
- డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో ఫిర్యాదులు..
- అధిక అధిక లాభాలు ఆశ చూపెట్టి మోసాలకు పాల్పడ్డ డిబి స్టాక్ బ్రోకింగ్..
- డిపి స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురుపై కేసులు..
- హైదరాబాదులో 20 వేల మంది డి బి స్టాక్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DB Stock Broking Scam: హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో ఫిర్యాదులు చేశారు. అధిక మొత్తంలో నష్టమోయామంటూ పెద్దమొత్తంలో ఫిర్యాదులు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.. డిపి స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురుపై కేసులు నమోదు చేశారు. స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందాయి. కేవలం హైదరాబాదులోనే 20 వేల మంది డిబి స్టాక్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ కు గురయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గౌహతి, నల్బరితో సహా ప్రధాన నగరాల్లో కార్యాలయాలను కలిగి ఉన్న డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితుల నుండి ఫిర్యాదులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ రూ.11 లక్షలు..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
హైదరాబాద్‌లోని పుప్పాలగూడ మణికొండకు చెందిన 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ అనే వ్యక్తి సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశాడు. అసోంలోని గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్‌కు చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు లాభాలు, అసలు మొత్తం వడ్డీ చెల్లింపులు కూడా తిరిగి చెల్లించలేదు దీనిపై పంచాక్షర్ కేసు నమోదు చేశారు. 2018లో DB స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది. అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది కస్టమర్లను ఆకర్షించింది. వీటిలో 120% వడ్డీని అందించే వార్షిక ప్లాన్, 54% అందించే సెమీ-వార్షిక ప్లాన్ మరియు 7% అందించే నెలవారీ ప్లాన్ వంటి ఎంపికలు ఉన్నాయి. అయితే, జూలై 2024 నుండి చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు వాపోయారు.
హైదరాబాద్ లో డిబి స్టాక్ బ్రోకింగ్..
హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి కాలనీలో డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది స్థానిక ప్రజలు డిబి స్టాక్ బ్రోకింగ్ ను నమ్మి ఈ పథకంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ స్కామ్‌తో జగదీష్ అనే వ్యక్తి కూడా వున్నట్లు స్థానికులు తెలిపారు. లక్షల నుంచి కోట్ల వరకు నష్టపోయినట్లు వెల్లడిస్తూ బాధితులు ముందుకు వచ్చారు. ఈస్కామ్ లో విశ్వజిత్ సింగ్ కంపెనీలో రూ. 36.8 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతనికి మొత్త పెట్టుబడి రాలేదు. కేవలం రూ. 16.2 లక్షల వడ్డీ చెల్లింపును పొందాడు. అదే విధంగా, 2022 డిసెంబర్‌లో రూ. 88.5 లక్షలు పెట్టుబడి పెట్టిన గంటాడి హరీష్ పాక్షిక వడ్డీ చెల్లింపును అందుకున్నాడు, కానీ ఇప్పటికీ తన అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో సహా ఇతర బాధితులు ఇంకా అధికారికంగా ఫిర్యాదులు చేయలేదు కానీ రాబోయే రోజుల్లో ముందుకు వస్తారని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!