Property Shock : కన్న తండ్రినే రోడ్డుపైకి నెట్టిన కూతుళ్లు.!

  • తండ్రి పట్ల కన్నకూతుళ్లే కసాయిలుగా మారారు
  • ఆస్తి మొత్తం లాక్కుని తిండి కూడా పెట్టకుండా బయటికి గెంటేశారు
  • మారేడుపల్లి సెకండ్ లక్ష్మి నగర్‌ బస్తీలో ఘటన
Property

Property

ఆస్తి కోసం సొంతవాళ్లనే కాదనుకుంటున్నారు.. బంధాలు.. బంధుత్వాల విలువను మరిచిపోయి.. కేవలం ఆస్తులకే విలువ ఇస్తున్నారు. సొంత వారిపైనే కసాయిలుగా ప్రవర్తిస్తున్నారు. కనీసం కని పెంచిన తల్లిదండ్రులు అనే కనికరం కూడా ఉండడం లేదు. ఇలాంటి హృదయవిదారక ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. కన్నవారిపై కొడుకులే కాదు.. కూతుళ్లు కూడా ఇలా ప్రవర్తిస్తారా? అని ఈ ఘటన మరో చర్చకు తెరలేపింది. తండ్రి సంపాదించిన ఆస్తి కావాలి.. కానీ తండ్రిని వద్దనుకున్నారు. కన్న తండ్రి పట్ల కన్నకూతుళ్లే కసాయిలుగా మారారు. ఆయన సంపాందించిన ఆస్తిని మొత్తం లాక్కుని ఆయనకు తిండి కూడా పెట్టకుండా బయటికి గెంటేశారు. ఈ అమానుష ఘటన సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి సెకండ్ లక్ష్మి నగర్‌ బస్తీలో జరిగింది..

Off The Record: మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్..?

చేతిలో చిల్లిగవ్వ లేదు.. కన్న కూతుళ్లు ఆస్తి లాగేసుకుని నిలువ నీడ లేకుండా చేశారు. దీంతో ఆ అభాగ్యుడు ఏం చేయని దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. దీంతో తన ఇల్లు లాక్కున్న కూతుళ్ల ఇంటి ముందే ఆందోళనకు దిగాడు… అలా ఆందోళన చేస్తున్న ఈయన పేరు మహాంకాళి రాజలింగం. మిథాలీలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. మారేడుపల్లిలోని 130 గజాల స్దలాన్ని ఇద్దరు కూతుళ్ళు భ్యాగలక్ష్మి, ఝాన్సీలకు రాసి ఇచ్చాడు. వారి వద్దే శేష జీవితం గడపాలని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఐదేళ్ల క్రితం ఇల్లు రాయించుకున్న తర్వాత కూతుళ్లు ఇద్దరూ ముఖం చాటేశారు. తిండి కూడా పెట్టకుండా ఐదేళ్ల నుంచి వేధిస్తున్నారు. దీంతో విసిగి వేసారి పోయిన రాజలింగం.. వారి ఇంటి ఎదుటే ఆందోళన చేస్తున్నాడు..

Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..