Site icon NTV Telugu

Cyber Fraud : 80 ఏళ్ల వృద్ధుడి నుంచి 8.7 కోట్ల మోసం.. షార్వీ పేరిట సైబర్ క్రిమినల్స్ పనితీరు

Honey Trap

Honey Trap

Cyber Fraud : ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురితో వ్యవహారం నడుపుతూ పెద్దాయన ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ ఆనందంలో ఆ ఇద్దరు అడిగినంత డబ్బులు పంపిస్తూ వెళ్లాడు. అయితే అతడి కుటుంబసభ్యులు డబ్బులు ఏమయ్యాయని నిలదీయడంతో అతడు చేస్తున్న యవ్వారం బయటపడింది. కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్‌ నేరగాళ్ల మోసం వెలుగులోకి వచ్చింది. అలా రంగంలోకి దిగిన సైబర్ కేటుగాళ్లకు అప్పుడప్పుడు బాగానే గిట్టుబాటు అవుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ వృద్ధున్ని ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్స్.. అతని వద్ద నుంచి ఏకంగా 8.7 కోట్ల రూపాయలు లాగేశారు..

Tollywood : నిర్మాతల నిర్ణయం అంగీకరించట్లేదు.. రేపు ఫెడరేషన్ నిరసన

ముంబైకి చెందిన వృద్ధునికి 2023లో షార్వీ అనే మహిళతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వీరిద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ‘భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నా’ అని వృద్ధుడిని షార్వీ నమ్మించి వలపు వల విసిరింది. ఈక్రమంలోనే అతడికి మాయమాటలు చెప్పి అప్పుడు ఇప్పుడు అంటూ డబ్బు వసూలు చేసింది…
కొన్నాళ్లకు షార్వీ స్నేహితురాలినంటూ కవిత అనే పేరుతో మరొకరు సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యారు. ఆమెతో కూడా వృద్ధుడు స్నేహంగా ఉంటూ.. ఆనందం పొందుతున్నాడు. ఈమె కూడా అడిగినప్పుడల్లా డబ్బులు పంపేవాడు. వృద్ధుడి ఆసక్తినే పెట్టుబడిగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు తర్వాత షార్వీ చనిపోయిందని ఆమె చెల్లెలు దినాజ్‌ పేరిట మరొకరు వృద్ధుడికి సందేశాలు పంపారు. షార్వీ చనిపోయిందని చెప్పి.. ఆమెకు సంబంధించిన ఆస్పత్రి బిల్లులు కట్టాలంటూ తప్పుడు ఆధారాలు చూపించి అతడి నుంచి మరికొంత డబ్బులు కాజేశారు. అయితే పంపిన డబ్బులను కొన్నాళ్లకు తిరిగివ్వాలని వృద్ధుడు వారిని కోరాడు. ఇక అప్పుడు అటువైపు వాళ్లు బెదిరింపులకు పాల్పడడం స్టార్ట్ చేశారు. డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు…

ఇంత జరిగినా వృద్ధుడిలో మార్పు రాలేదు. అతడి బలహీనతను అడ్డం పెట్టుకున్న సైబర్‌ నేరగాళ్లు.. దినాజ్‌ ఫ్రెండ్‌ జాస్మిన్ అంటూ మరొకరు సందేశాలు పంపారు. ఆమెతో కూడా 80 ఏళ్ల వృద్ధుడు సన్నిహితంగా కొనసాగాడు. వారి మాయ మాటల బుట్టలో చిక్కుకున్న అతడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తూ వచ్చాడు. ఇలా పంపిస్తూ 2023 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆ పెద్దాయన దాదాపు 734 సార్లు డబ్బులు పంపారు. వారికి డబ్బులు చెల్లించేందుకు కొన్నిచోట్ల అప్పు కూడా చేసినట్లు సమాచారం..

ఈలోపు వృద్ధుడి నివాసంలో డబ్బు విషయమై ప్రస్తావన వచ్చింది. డబ్బులు ఏమయ్యాయని కుటుంబసభ్యులు నిలదీయడంతో ఆయన తెల్లముఖం వేశారు. జరిగిన మొత్తం విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వాళ్లు నివ్వెరపోయారు. సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని గ్రహించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా ఆ పెద్దాయన మొత్తం రూ.8.7 కోట్లు మోసపోయాడని గుర్తించారు… పోలీసుల విచారణలో తేల్చిన వాస్తవాలు తెలుసుకున్న అనంతరం 80 ఏళ్ల వృద్ధుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇదంతా సైబర్‌ మోసం అని తెలుసుకున్న బాధితుడు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత అవగాహన కల్పించినా సోషల్‌ మీడియా పరిచయస్తులను నమ్మి పెద్ద ఎత్తున బాధితులు మోసాల బారిన పడుతున్నారు…

Pulivendula ZPTC By Elections: 30 ఏళ్లుగా ఏకగ్రీవం.. ఆసక్తికరంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక..

Exit mobile version