Crime News: సమాజంలో రోజురోజుకి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వావివరసలు మరిచి కొందరు దారుణాలకు వడిగడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు హత్య చేశారు. అందిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులు పని కోసం బయలుదేరిన తర్వాత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తెను చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. దానితో ఆ విషయాన్నీ స్థానికులకు తెలిపాడు తండ్రి. దీనితో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ పోలీస్ బృందం, డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌లతో కలసి ఘటనపై ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికను హతమార్చిన దుండగులు..!

Murder