Crime News: ప్రేమించి.. సహజీవనం చేస్తున్న యువతిని డబ్బు కోసం వ్యభిచార రొంపిలోకి దించాలని ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణంగా పొడిచి హత్య చేశాడు. కోనసీమ జిల్లాలో జరిగిన యువతి హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు ఓలేటి పుష్ప. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెం స్వస్థలం. ఈమెను ప్రియుడు షేక్ షమ్మ దారుణంగా హత్య చేశాడు.
నిజానికి పుష్పకు 4 ఏళ్ల క్రితం దగ్గరి బంధువుతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. కానీ వివాహం జరిగిన నాలుగు నెలలకే భర్తతో వ్యక్తిగత వివాదాలతో విడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు షేక్ షమ్మ అనే కార్ ఏసీ మెకానిక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహేతర బంధం పెట్టుకున్నారు. కొంతకాలంగా బి. సావరం సిద్ధార్థ నగర్‌లో ఇల్లు అద్దెకి తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంజాయి, చెడు వ్యసనాలకు బానిసగా మారిన షేక్ షమ్మ.. నిత్యం పుష్పను వేధించేవాడు. డబ్బుల కోసం రోజూ కొడుతుండేవాడు. దీంతో అతని వేధింపులు తాళలేక ఇంటికి తిరిగి వచ్చేసింది.
Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ప్రియుడే చంపేశాడా..? ఈ 2 గంటల్లో ఏం జరిగింది?
పుష్ప కోసం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన షేక్ షమ్మ… అర్జంటుగా డబ్బులు కావాలని గొడవ పెట్టుకున్నాడు. కానీ తన దగ్గర లేవని చెప్పింది పుష్ప. దీంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. పైగా వ్యభిచారం చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ప్రియుడి నోట వ్యభిచారం మాట రావడంతో ఒక్కసారిగా షాకైంది పుష్ప. అంతేకాదు అలాంటి నీచమైన తాను చేయనని తెగేసి చెప్పేసింది. దీంతో ఇరువురి మధ్య గొడవ ముదిరింది. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న చాకుతో ఆమెపై దాడి చేశాడు షేక్ షమ్మ. ఎడమ రొమ్ముపై దారుణంగా పొడిచేశాడు. అదే సమయంలో కత్తి దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పుష్ప సోదరుడు, ఆమె తల్లిని కూడా గాయపరిచాడు.
షేక్ షమ్మ దాడిలో తీవ్రంగా గాయపడ్డ పుష్ప.. అక్కడికక్కడే మృతి చెందింది. పుష్ప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాజోలు మండలంలో కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని కాదనుకున్న పుష్ప.. చివరికి ఓ ఉన్నాది చేతికి చిక్కింది. తనకు తాను తన భవిష్యత్తును నాశనం చేసుకుంది. ప్రేమించే ముందు అవతలి వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోని పక్షంలో ఇలాంటి దారుణాలే జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.
