Site icon NTV Telugu

Crime News: భార్యను ఇటుకతో చంపిన భర్త.. 20 ఏళ్ల తర్వాత అరెస్ట్!

Digital Arrest

Digital Arrest

Crime News: ఢిల్లీకి చెందిన 60 ఏళ్ల వీర్‌పాల్ అనే వ్యక్తి తన భార్యను ఇటుకతో కొట్టి హత్య చేసిన కేసులో ఇరవై ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అయితే, తాజాగా అతడిని పోలీసులు లక్నోలో అరెస్ట్ చేశారు. హంతకుడు 2004లో భార్యను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అప్పట్లో ఆమె మృతదేహం పక్కన రక్తంతో నిండి ఉన్న ఇటుక, విరిగిన దంతాలు, గాజులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అప్పటి నుంచి అతడు పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేశాడు.

Gurram Paapi Reddy: ఆసక్తికరంగా గుర్రం పాపిరెడ్డి టీజర్

అయితే, మహిళ హత్యకు సంబంధించి అతడి పిల్లలు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా వీర్‌పాల్ ఈ పని చేశాడని స్పష్టం అయ్యింది. అతనితో పాటు సురేష్ కూడా హత్యలో భాగమని పిల్లలు తెలిపారు. దీనితో సురేష్ ను 2007లో అరెస్ట్ చేయడంతో అతడికి జీవిత కాల శిక్ష విధించింది కోర్టు. కానీ, వీర్‌పాల్ మాత్రం విజయ్ అలియాస్ రామ్‌దయాల్ అనే కొత్త పేరుతో లక్నోలో జీవిస్తున్నాడు. అక్కడే మరో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల తండ్రిగా మారిపోయాడు.

Donald Trump: భారత్‌కు పిడుగులాంటి వార్త! టారిఫ్‌లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!

ఎట్టకేలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఏడాది పాటు చేసిన గట్టిన దర్యాప్తుతో అతడి ఆచూకీని కనిపెట్టారు. దానితో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయ్యాక వీర్‌పాల్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడి అరెస్టుతో 21 ఏళ్ల న్యాయ ప్రయాణం చివరకు పూర్తయ్యింది. ప్రస్తుతం హంతకుడు జైల్లో అసలు లెక్క పెడుతున్నాడు.

Exit mobile version