NTV Telugu Site icon

Betting Mafia attack: రెచ్చిపోయిన క్రికెట్‌ బెట్టింగ్ మాఫియా.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి..!

Betting

Betting

క్రికెట్‌ బెట్టింగ్‌ అంతా గుట్టుగా సాగిపోతుంటుంది.. గుట్టు చప్పుడు కాకుండా.. వందలు, వేలు, లక్షలు.. ఇలా వారికి స్టేటస్‌ను బట్టి బెట్టింగ్‌ నిర్వహిస్తూనే ఉన్నారు.. పోలీసులు నిఘా పెట్టినా.. ఎంతో మందిని అరెస్ట్‌ చేసినా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెట్టింగ్‌ మాఫియా రెచ్చిపోయింది.. బూర్గంపాడు మండలంలో క్రికెట్ కేంద్రంగా రెచ్చిపోయింది బెట్టింగ్ గ్యాంగ్.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా.. వారికి ఆస్పత్రిలో చేర్చారు స్థానికులు.. ఇక, ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Read Also: No Diwali: దీపావళి అంటేనే భయం.. వేడుకలపై బ్యాన్‌.. ఎక్కడ..? ఎందుకంటే..?

రెచ్చిపోయిన బెట్టింగ్‌ మాఫియా వ్యహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది, క్రికెట్ ఆటని అడ్డగా చేసుకొని బెట్టింగ్ కు పాల్పడిన ఇరువర్గాలలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసిన ఘటన బూర్గంపాడు మండలం తాళ్ల గోమ్మూరులో చోటుచేసుకుంది.. బూర్గంపాడు మండలం తాళ్ల గొమ్మురులో ఆదివారం జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ వివాదానికి కారణమైంది, క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ పాల్పడిన వారు డబ్బులు చెల్లించకపోవడంతో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, డబ్బులు చెల్లించకపోవడంతో బెట్టింగ్ కు పాల్పడిన వారి ఇంట్లోకి చొరబడి మరి దాడి చేయడం సంచలనం సృష్టిస్తుంది, కొంతమంది యువకులు సినీ పక్కిలో చేసిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.. ఈ దాడిలో తాళ్ల గోమ్మూరుకు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.