Site icon NTV Telugu

Bribe: డీసీపీని రూ.500 లంచం డిమాండ్‌ చేసిన కానిస్టేబుల్.. తర్వాత ఏమైందంటే..?

Bribe

Bribe

కొన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపణలు ఉన్నాయి.. అందులో పోలీసు డిపార్ట్‌మెంట్‌పై కూడా విమర్శలు ఉన్నాయి.. ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఆఫీసర్ల వరకు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి.. అయితే, ఓ కానిస్టేబుల్‌.. ఏకంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కే దమ్కీ ఇచ్చాడు.. సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఆయన్ను గుర్తుపట్టలేకపోయిన ఆ కానిస్టేబుల్‌.. ముందు రూల్స్‌ మాట్లాడాడు.. చలానా రాయమంటారా? అంటూ డీసీపీని బెదిరించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆ తర్వాత ఓ ఆఫర్ ఇచ్చాడు.. రూ.500 ఇస్తే వదిలేస్తానంటూ.. అసలు విషయం కక్కాడు.. రూ.500 లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.. అలా రెడ్‌ హ్యాండెడ్‌గా డీసీపీకే దొరికిపోయాడు..

Read Also: Minister Vishwaroop: మంత్రి విశ్వరూప్‌కు తీవ్ర అస్వస్థత..

రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ నార్త్ విభాగంలో పరీష్ దేశ్ ముఖ్ డీసీపీగా వ్యవహరిస్తున్నారు. బుధవారం రాత్రి నగరంలో నాకాబందీ నిర్వహించి.. తిరిగి డీసీపీ కార్యాలయానికి వెళ్తున్నారు.. ఆయన వాహనంపై పోలీసు గుర్తు లేకపోవడంతో.. ఆయనతో పాటు ఉన్న గన్ మన్, డ్రైవర్ కూడా సాధారణ దుస్తుల్లోనే ఉండడంతో.. మంచి బేరమే దొరికింది అనుకున్నాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాజేంద్రప్రసాద్.. వెంటనే డీసీపీ వాహనాన్ని ఆపిన అతడు.. సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటూ.. కాస్త గట్టిగానే మాట్లాడాడు.. కొద్ది సేపటి తర్వాత అసలు విషయం బటయపెట్టాడు.. చలాన్‌ రాయాలా? రూ.500 ఇచ్చి వెళ్లిపోతారా? అనే ఆఫర్‌ ఇచ్చాడు.. ఈ విషయాన్ని డీసీపీ వెంటనే తన పై అధికారులకు నివేదించారు. డీసీపీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేశారు అధికారులు.. విధి నిర్వహణలో పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ ఇది అని.. అందులో కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ దొరికిపోయినట్టు పోలీసులు అధికారులు చెబుతున్నారు.

Exit mobile version