NTV Telugu Site icon

Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిపై మూత్ర విసర్జన చేసి, దాడి..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో దారుణం జరిగింది. 12 తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు యువకుల గుంపు దాడి చేసింది, అంతటితో ఆగకుండా అతనిపై మూత్రవిసర్జన చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌‌గా మారాయి. డార్క్ గ్రే కలర్ జాకెట్ ధరించిన వ్యక్తి బాధిత యువకుడిని కొట్టి, అతనిపై మూత్ర విసర్జన చేయడం వీడియోలో కనిపిస్తోంది. మరో ఇద్దరు ఈ ఉదంతాన్ని వీడియో తీశారు. దాడి ఆపాలని విద్యార్థి ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. విద్యార్థి తలపై, వీపుపై ఆ వ్యక్తి పదేపదే దాడి చేయడం కనిపిస్తుంది.

ఈ వీడియో వైరల్ కావడంతో యూపీ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒకర్ని అరెస్ట్ చేశారు. నిందితులను అవిశర్మ, ఆశిష్ మాలిక్, రాజన్, మోహిత్ ఠాకూర్‌లుగా గుర్తించారు. నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. దాడిలో పాల్గొన్న ఆశిష్ మాలిక్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీస్ అధికారి పీయూష్ సింగ్ తెలిపారు.

Read Also: PM Modi: రేపు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ

నగరంలోని తన బంధువు ఇంటికి వెళ్లి వస్తుండగా తన కొడుకును కిడ్నాప్ చేశారని బాధితుడి తండ్రి చెప్పారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశారని తెలిపారు. అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతకగా.. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని, తనపై జరిగిన దాడి గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడి తండ్రి ఆరోపించారు. పోలీసులు నవంబర్ 16 కేసు నమోదు చేశారని, కిడ్నాప్ సెక్షన్లను తప్పించారని కుటుంబీకులు ఆరోపించారు. దాడి చేసిన వారిలో కొందరు బాధిత విద్యార్థి స్నేహితులని, అయితే వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని కుటుంబీకులు చెబుతున్నారు. నిందితులపై అల్లర్లు, స్వచ్ఛందంగా గాయపరచడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపుల కింద అభియోగాలు మోపారు.