కర్నూల్ జిల్లాలో ఒక చర్చి ఫాదర్ వికృత చేష్టలు బయటపడ్డాయి. ప్రార్థనల పేరుతో ఆ ఫాదర్ చేసిన పాడుపని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇద్దరు బాలికలను చర్చికి పిలిచి వారితో నీచమైన పనిచేయించాడు. చర్చికి పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. చాగలమర్రి మండలంలో ప్రసన్న కుమార్ ఆ గ్రామంలోని ఒక చర్చికి పాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రార్థనలతో రోగాలను నయం చేస్తానని ప్రజలను నమ్మించడంతో గ్రామస్తులందరూ ఆయనను నమ్మారు. నిత్యం ఎవరో ఒకరు చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే గత నెల 16న ఇద్దరు బాలికలను ప్రార్థన చేయించుకోవడానికి చర్చికి రమ్మని పిలిచాడు. బాలికల తల్లి ఇంట్లో లేకపోవడంతో వారిద్దరే ఫాదర్ వద్దకు వెళ్లారు. ప్రార్థన చేస్తున్న నెపంతో బాలికలపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మర్మాంగాన్ని చూపిస్తూ బాలికలను పట్టుకోమని బలవంతపెట్టాడు. దీంతో కంగుతిన్న బాలికలు అక్కడికి నుంచి పారిపోయి రాత్రి ఇంటికివచ్చిన తల్లికి విషయం చెప్పారు.
విషయం తెలుసుకున్న తల్లి పాస్టర్ ని నిలదీయగా.. గ్రామ పంచాయితీ పెద్దలకు పదివేలు ఇచ్చి ఈ విషయాన్ని బయటకు రాకుండా చూశాడు. బాధిత కుటుంబానికి యాభై వేలు ఇచ్చి విషయం సద్దుమణిగేలా చేశాడు. కానీ, పాపం ఎక్కడికి పోదు అన్నట్లుగా చర్చి ఫాదర్ వికృత చేష్టలను ఒక వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు చర్చి పాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
